కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితులు ఉండటంతో దేశీయంగా నిత్యవసర సరుకులు, కూరగాయలకు తీవ్ర డిమాండ్ నెలకొంది. మరోవైపు ఇదే అదునుగా దళారులు కూడా కృత్రిమ కొరత సృష్టించే యత్నాలు కొనసాగుతున్నాయి.
ఇది ఇలా ఉంటే… ఆన్ లైన్ లో వినియోగదారులకు సరుకులు అందించే బిగ్ బాస్కెట్ ఇప్పటికే తన సేవలు హైదరాబాద్ లో నిలిపి వేసింది. ఈ కామర్స్ సంస్థలు అన్నీ తమ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ప్రజలు మరింతగా రోడ్లపైకి రావటం మొదలుపెట్టారు. అయితే, పోలీసుల ఆంక్షల కారణంగానే తాము సేవలు నిలిపివేస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి.
తాజాగా తెలంగాణ పోలీసులు ఈ కామర్స్ సంస్థలు డోర్ డెలివరీ చేసుకోవచ్చని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. అయినప్పటికీ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ బిగ్ బాస్కెట్ మాత్రం ఇప్పటికైతే తాము హైదరాబాద్ లో సేవలు నిలిపేశామని, పునరుద్ధరణకు సమయం పడుతుందని ప్రకటించాయి.