భక్తిపేరుతో కొంతమంది బాబాలు చేసే అరాచకాలు అన్నీఇన్నీకావు. ఆధ్యాత్మికతపేరుతో అక్రుత్యాలకు పాల్పడుతున్నారు.అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నీచానికి తెగబడుతున్నారు. తాజాగా పాతబస్తీలో వెలుగులోకి వచ్చిన ఓ దొంగ బాబా బాగోతం రాష్ట్రవ్యాప్తం చర్చనీయాంశం అయ్యింది. పోలీసులు సమాచారం ప్రకారం..పూజల పేరుతో ఈ క్రిమినల్ బాబా యువతులు,మహళల నగ్నఫోటోలను,వీడియోలను తీస్తున్నాడు.
అంతేకాదు వాటిని పక్కరాష్ట్ర వ్యభిచార గ్రుహాలకు విక్రయిస్తున్నాడు.ఈ క్రమంలో పాతబస్త్రీలోని చాలామంది అమాయకుల నగ్నఫోటోలు మహారాష్ట్రలోని వ్యభిచార గ్రుహాలకు విక్రయించిన ఉదంతం పోలీసులని అవాక్కయ్యేలా చేసింది. అమ్మాయిల శరీర సౌష్టవాలను బట్టి అమ్మాయిలకు, మహిళలకు సదరు ముఠా రేటు ఫిక్స్ చేస్తున్నారని తెలిసింది. పాతబస్తీలోని ఓ ఎన్జోవో ఆపరేషన్ చేసి చంద్రాయాణ గుట్టపోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాబా గుట్టు బట్ట బైటకొచ్చింది.
నిందుతుణ్ణి అదుపులోనికి తీసుకోవడంతోపాటు,సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసకున్నారు. కాగా అందులో వందల సంఖ్యలో అశ్లీల ఫోటోలు వీడియోలు ఉండడాన్ని గమనించిన పోలీసులు మరోసారి విస్తుపోయారు.ఇప్పటి వరకూ ఎంతమంది నకిలీబాబా వలలో చిక్కుకున్నారనే కోణంలో పోలీలు దర్యాప్తు చేస్తున్నారు.
బాబా ఇంత నీచానికి పాల్పడుతున్నా మహిళలు ఇతని వలలో ఎలా పడ్డారు. ఫేక్ బాబా ఏదైనా మత్తుపదార్థాలిస్తున్నాడా ? బెదిస్తున్నాడా ? ప్రలోభపెడుతున్నాడా? అనే పలుకోణాల్లో కూడా పోలీసులు బ్రోకర్ బాబాపై దర్యాప్తు జరుపుతున్నారు. ఇలాంటి బాబాల ఉచ్చులో పడకుండా,అప్రమత్తంగా ఉండాలని మీలాంటి వారి అమాయకత్వమే వారికి పెట్టుబడని పోలీసులు పాతబస్తీప్రజలను హెచ్చరించారు.