కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న దేశాల గుత్తాధిపత్యం… పేద దేశాల పాలిట శాపంగా మారింది. వ్యాక్సిన్లు పంచుకోవాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుతున్నా… ఇప్పటి వరకు పేద దేశాలకు అందిన వ్యాక్సిన్లు కేవలం 25మాత్రమేనని డబ్ల్యూహెచ్వో ప్రకటించింది. 49 ధనిక దేశాల్లో ఇప్పటివరకు 4 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను వేస్తే పేద దేశాల్లో కేవలం 25 వ్యాక్సిన్ డోస్‌లు మాత్రమే ఇచ్చారన్నారు.
తక్కువ ఆదాయం కలిగి ఉన్న గెనీ అనే ఒక్క దేశంలో మాత్రమే ఇప్పటివరకు 25 వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చినట్టు టెడ్రోస్ చెప్పారు. ఆ 25 డోస్‌లు కూడా రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ అని అన్నారు. వ్యాక్సిన్ డోస్‌లను ప్రపంచం మొత్తం న్యాయంగా పంచాలని ఆయన ప్రపంచ దేశాలను, వ్యాక్సిన్ తయారీదారులను కోరారు. ధనిక దేశాల అనుసరిస్తున్న విధానం మంచిది కాదని, బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు.