దేశంలో గ్యాస్ ధరలు పెరగడంపై కేంద్రాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమం కాంగ్రెస్ పాలనలో సాధ్యమని ఆయన అన్నారు.
ప్రజాసంక్షేమం తమ ఆర్థిక విధానంలో ప్రధాన అంశమని ఆయన వివరించారు. కాంగ్రెస్ పాలనలో గ్యాస్ ధరలను, ప్రస్తుత ధరలను పోలుస్తూ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో 2014 మేలో గ్యాస్ ధర రూ. 410గా ఉండేదని తెలిపారు. ఆ తర్వాత మోడీ సర్కార్ వచ్చాక ఇప్పటి వరకు గ్యాస్ ధరపై రూ. 585.50 పైసలు పెరిగిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్యాస్ సిలిండర్ పై రూ. 827లు సబ్సిడీగా ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. కానీ మోడీ సర్కార్ హయాంలో సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. ఇప్పటి ఒక సిలిండర్ ధరకు అప్పుడు తాము రెండు సిలిండర్లు ఇచ్చినట్టు చెప్పారు.