సమ్మర్ లో కూల్ కూల్ గా ఐస్ క్రీమ్ తినాలని ఎవరికి మాత్రం అనిపించదు. మరి రోజూ బైటకెళ్ళి తినాలంటే కుదరని పని..పైగా ఖర్చుతో కూడుకున్నపని. అందుకని..మనకుతినాలనిపించిన టైమ్ లో చల్లచల్లని రుచికరమైన ఐస్‌క్రీమ్‌ని ఇంట్లోనే తయారు చేసుకునే ఐస్ క్రీమ్ లాంటి..ఐస్ క్రీమ్ తయారీ వీడియోని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసారు.
అంతే కాదు..ఐస్ క్రీమ్ చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని గంట లేదా రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాల్సి ఉంటుంది. అది లేకుండా కూడా చక్కగా ఐస్‌క్రీమ్‌ను తయారు చేసుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా..?మన ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో చూడాల్సిందే.
సాధారణంగా బయట తయారుచేసే ఐస్‌క్రీమ్స్‌లో చక్కెర అధిక మొత్తంలో ఉంటుంది. ఇంట్లో చేసుకోగలిగే ఈ ఐస్‌క్రీమ్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇంట్లో ఈ ఐస్‌క్రీమ్ తయారు చేసుకోవాలంటే అందుకు అవసరమైన పదార్థాలు
మార్కెట్‌లో అందుబాటులోనే ఉంటాయి. అయితే, దీని తయారీకి రిఫ్రిజరేటర్ చాలా ముఖ్యం.ఐస్‌క్రీమ్ తయారు ఫ్రిజ్ లేకుండా కూడా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చో తెలియజెప్పే వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోలో ఓ మహిళ ఎంతో చక్కగా ఐస్ క్రీమ్ తయారు చేస్తూ కనిపించింది.
రిఫ్రిజరేటర్‌కు బదులు సీలింగ్ ఫ్యాన్‌ను ఉపయోగించింది. వీడియో షేర్ చేసిన మహీంద్రా.. ‘హ్యాండ్ మేడ్, ఫ్యాన్ మేడ్ ఐస్ క్రీమ్. ఇది భారత్‌లో మాత్రమే సాధ్యం’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ట్రై చేయండి.
Where there’s a will, there’s a way.
Hand-made & Fan-made ice cream. Only in India… pic.twitter.com/NhZd3Fu2NX— anand mahindra (@anandmahindra) March 29, 2023