తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కేసులు మళ్లీ పెరుగుతున్నా.. మరణాలు మాత్రం కొంత అదుపులోనే ఉన్నాయి. చివరికి ఏపీలో కూడా రోజువారీ మరణాలు సున్నాకు చేరినా.. తెలంగాణలో మాత్రం కనీసం రోజుకోక ప్రాణం కచ్చితంగా పోతోంది. నిన్న రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతిచెందారు. వీరితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో 1,637 మంది కరోనాతో చనిపోయారు.
ఇక తాజాగా 152 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,99,406కు చేరింది. కరోనా బారి నుంచి నిన్న 114 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2,95,821కు పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,948 గా ఉంది.