భార్య, పిల్లలు కూడా ఓట్లు వేయకుండా విలన్లకు షాక్ ఇచ్చిన సీన్లను మనం తెలుగు సినిమాల్లో తరచూ చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనే ఒకటి గుజరాత్ లో చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తికి తన కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయకుండా షాక్ ఇచ్చారు. వాపి జిల్లా చర్వాలా గ్రామంలో పోటీచేసిన సంతోష్ అనే వ్యక్తికి ఈ పరిస్థితి ఎదురైంది. పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసిన సంతోష్ కు ఫలితాలు విడుదలైన తరువాత ఒక్క సారి గుండె ఆగిన పని అయింది. ఆయనకు ఒక్క ఓటు మాత్రమే పడిందని పోలింగ్ అధికారులు చెప్పడంతో లబోదిబోమంటున్నాడు.
తన ఇంట్లో మొత్తం 12 మంది ఓట్లరు ఉంటే.. తనకు తన ఓటు తప్ప మరొకరి ఓటు పడలేదు. సొంత కుటుంబంలో కూడా తనకు ఓట్లు పడలేదని సంతోష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 12 మందిలో కనీసం ఒక్కరు కూడా ఓటు వేయకపోవడాన్ని ఆలోచిస్తే అయో సంతోష్ అనిపిస్తుంది.