బ్యాంక్ డిపాజిట్లపై ఖాతాదారులకు రూ.లక్ష రూపాయల వరకే బీమా కవరేజ్ ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానంగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ ఈ మేరకు సమాధానమిచ్చింది. డీఐసీజీసీ చట్టం 1961 లోని సెక్షన్ 16(1) ప్రకారం బ్యాంకులు విఫలమైనప్పుడు, నష్టాల్లో కూరుకున్నప్పడు ఖాతాదారుల డిపాజిట్లపై డీఐసీజీసీ లక్ష వరకు బీమా కవరేజ్ అందింస్తుందని తెలిపారు. పొదుపు, ఫిక్స్‌డ్, కరెంట్ ఖాతాలు, రికరింగ్ డిపాజిట్లపై ఈ బీమా వర్తిస్తుంది. అని తెలియజేసింది.