కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. నేతలు పాత విషయాలు మర్చిపోయి.. పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏఐసీసీ ఆదేశాలతో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ యాత్ర చేపట్టారు. అయితే.. మరోసారి పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. ఏకంగా పార్టీ అధ్యక్షుడికే ఝలక్ ఇచ్చారు ఓ నేత.
బుధవారం రేవంత్ పాదయాత్ర రూట్ మ్యాప్ పై గందరగోళం నెలకొంది. యాత్ర నర్సంపేటలోకి ప్రవేశించాల్సి ఉండగా మహబూబాబాద్ నియోజకవర్గానికి రూట్ మ్యాప్ ను షిఫ్ట్ చేశారు. నర్సంపేటలో రేవంత్ పాదయాత్రకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ దొంతి మాధవరెడ్డి సహకరించడం లేదని వార్తలు వస్తున్నాయి. అనూహ్యంగా ఈయన కూడా పాదయాత్రకు దిగారు.
దుగ్గొండి మండలం కేశవపూర్ నుండి పాదయాత్ర ప్రారంభించారు మాధవరెడ్డి. దీన్నిబట్టి నియోజకవర్గంలోనే ఉన్నా ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సహకరించలేదనే చర్చ నడుస్తోంది. మహబూబూబాద్ లో రేవంత్, నర్సంపేట నియోజకవర్గంలో మాధవరెడ్డి పాదయాత్ర చేయడంపై అనేక కథనాలు వస్తున్నాయి.