అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేసే పనిలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది. అంతా అనుకున్నట్టు జరిగితే మాత్రం వచ్చే ఏడాది మొదటి నెలలోనే ఈ ఆలయాన్ని అత్యంత వైభవంగా ప్రారంభం చేయాలని యోగి ఆదిత్య నాథ్ సర్కార్ యోచిస్తోంది.
అయితే అయోధ్యలో మౌళిక సదుపాయాల ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అయోధ్యలో విమానాశ్రయం, రైల్వేస్టేషన్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. సహదత్ గంజ్ నుంచి నయా ఘాట్ వరకు 13 కిలోమీటర్ల రహదారి రామ్ పథ్ నిర్మాణం స్పీడ్ గా జరుగుతోంది. రామజానకీ మార్గం, భక్తి మార్గం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు సీం యోగీ వెల్లడించారు.
అయితే సందర్శకుల తాకిడికి అనుగుణంగా ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లను విస్తరిస్తున్నారు. శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హి ఆలయాలకు భక్తుల రాకపోకలను సులభతరం చేయడమే ముఖ్య లక్ష్యమని పేర్కొంది యోగీ సర్కార్. రామజన్మభూమి మార్గం వెడల్పు 30 మీటర్లు, భక్తి మార్గం వెడల్పు 14 మీటర్లుగా చేస్తున్నారు.
ఇక పురోగతిలో ఉన్న వివిధ ప్రాజెక్టులను సీఎం యోగి పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ముంపుకు గురైన దుకాణం దారులకు ప్రత్యమ్నాయ మార్గాలను కూడా చూపిస్తున్నారు. కాగా, రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు ఆహ్వానం పలికారు.