భారత మొట్టమొదటి మల్టీ ఆర్ట్స్ కల్చరల్ సెంటర్.. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ మార్చి 31, 2023న ప్రారంభమైంది. ఈ కల్చరల్ సెంటర్లో ప్రత్యేకించి రంగస్థలం, లలిత కళలు, సంగీతం, చేతివృత్తులు వంటి అనేక కళాఖండాలను ప్రదర్శిస్తారు. భారత, ప్రపంచ సాంస్కృతిక, మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు ఇదో ప్రయత్నం. ఇందులో 3 బ్లాక్బస్టర్ షోలను ప్రదర్శించనున్నారు.
అంతేకాదు.. ‘స్వదేశ్’ అనే పేరుతో స్పెసల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎక్స్పోజిషన్ కూడా ఉంటుంది. ‘the great indian musical civilization to nation‘ అనే సంగీత థియేట్రికల్ కూడా ప్రదర్శించనున్నారు. ‘Indian In Fashion‘ అనే కాస్ట్యూమ్ ఆర్ట్ ఎగ్జిబిషన్, ‘సంగం/సంగమం’ అనే విజువల్ ఆర్ట్ షోను కూడా కల్చరల్ సెంటర్లో ప్రదర్శించనున్నారు.
భారత సాంస్కృతిక ఆచారాలతో పాటు ప్రపంచంపై పడే ప్రభావంపై స్పెషల్ ప్రొగ్రామ్ కూడా నిర్వహించనున్నారు. కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ, ఈ కల్చరల్ సెంటర్కు జీవం పోయడం అనేది పవిత్రమైన యాత్రగా అభివర్ణించారు. సినిమా, మ్యూజిక్, నృత్యం, జానపద కథలు, నాటకం, సాహిత్యం, సైన్స్, కళలు, ఆధ్యాత్మికతలో సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించాలనేది తమ ఆకాంక్షగా పేర్కొన్నారు.
ప్రపంచంలో పేరొందిన అనేక ఆసక్తికరమైన విషయాలను భారతీయులకు పరిచయం చేయాలన్నదే తమ ప్రయత్నమని ఆమె చెప్పారు. ఇందులో విద్యార్థులు, పిల్లలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లకు ఈ కల్చరల్ సెంటర్లోకి ఉచితంగా అనుమతి ఉంటుందని నీతా అంబానీ తెలిపారు.
స్కూల్, కాలేజీ విద్యార్థులకు పోటీలతో పాటు ఆర్ట్స్ టీచర్లకు అవార్డులు, ఇన్-రెసిడెన్సీ గురు-శిష్య ప్రోగ్రామ్లతో అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే, పెద్దలకు కళా అక్షరాస్యతకు సంబంధించి కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. ‘స్వదేశ్’ ప్రొగ్రామ్ ద్వారా పైతానీ, బనారసి లాంటి 8 అద్భుతమైన క్రాఫ్ట్లు, భారతీయ ప్రాంతీయ కళారూపాలను ప్రదర్శించనున్నారు.
ఈ సెంటర్లో 2,000 సీట్ల గ్రాండ్ థియేటర్ ఏర్పాటు చేశారు. భారతదేశంలోని అతిపెద్ద ప్రొసీనియంతో రూపొందించిన ప్రపంచ స్థాయి వేదికగా నిలువనుంది. ఆసక్తి ఉన్నవారు అధికారిక నీతా ముఖేష్ అంబానీ (Nita Mukesh Ambani) కల్చరల్ సెంటర్ వెబ్సైట్- nmacc.com లేదా BookMyShow ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.