బీహార్‌లో గ్రామస్తులను ఓ పులి ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటి వరకు 9 మంది గ్రామస్తులను పులి చేతిలో ప్రాణాలు విడిచారు. దీంతో ఆ గ్రామస్తులు బెంబెలెత్తి పోతున్నారు. ఈ క్రమంలో పులిని పట్టుకునేందుకు అటవి అధికారులు ఆపరేషన్ బాగ్ ను చేపట్టారు.
బగాహా ప్రాంతంలోని చెరుకు తోటల్లో దాక్కున్న పులిని చంపేందుకు 10 మంది షూటర్లను అధికారులు రంగంలోకి దించారు. పులిని పట్టుకునేందుకు తోటలో ఉచ్చును బిగించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
వాల్మీకినగర్ టైగర్ రిజర్వ్ నుంచి జనారణ్యంలోకి పులి ప్రవేశించింది. దీంతో పులిని పట్టుకునేందుకు
8 మంది షార్ప్ షూటర్లు రంగంలోకి దిగారు. వారితో పాటు సుశిక్షితులైన నలుగురు సైనికులు సైతం అక్కడికి చేరుకున్నారు.
పాట్నాకు చెందిన నలుగురు ఎస్‌టీఎఫ్ షూటర్లు సైతం మాటు వేసి ఉన్నారు. సుమారు 200 మందికి పైగా అటవీ సిబ్బందిని పొలం చుట్టూ మొహరించారు. గ్రామస్తులు అటు వైపు రాకుండా చూసేందుకు ప్రత్యేకంగా 80 మంది భద్రతా సిబ్బందిని అధికారులు నియమించారు.
ఇది ఇలా ఉంటే శుక్రవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన తల్లీ కొడుకులను పులి చంపితిన్నది. గేదెలకు గడ్డి కోసుకుని తీసుకు వెళ్లేందుకు అడవి ప్రాంతానికి రాగా వారిపై పులి దాడి చేసింది. గడిచిన మూడు రోజుల్లో నలుగురిని చంపింది.