పంజాబ్ లో అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ దగ్గర ఖలిస్తాన్ అనుకూల నినాదాలు కలకలం రేపాయి. ఆపరేషన్ బ్లూస్టార్ కు 38 ఏండ్లు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ టెంపుల్ దగ్గర సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా గోల్డెన్ టెంపుల్ దగ్గర ‘అకాలీ తఖ్త్’ ఖలిస్తాన్ అనుకూల నినాదాలతో మారుమోగింది. పలువురు యువకులు ‘ ఖలిస్తాన్ జిందాబాద్’ అనే నినాదాలు ఉన్న ప్లకార్డులను పట్టుకుని కనిపించారు.
యువకుల టీ షర్ట్ లపై ఖలిస్తాన్ నాయకుడు జర్నల్ బింద్రెయిన్ వాలా ఫోటోలు ఉన్న టీ షర్టులన ధరించి నినాదాలు చేశారు. అక్కడ శిరోమణి అకాళీదల్ నాయకుడు మాజీ ఎంపీ సిమ్రాన్ జిత్ సింగ్ మాన్, ఆ పార్టీ నాయకులు కూడా కనిపించడం గమనార్హం.
ఈ సందర్బంగా మాట్లాడిన సిమ్రాన్ జిత్ సింగ్ మాన్… సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ హత్యను ఆయన ఖండించారు. సిద్దూ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.