ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ పౌరులు, విద్యార్థులతో మరో ప్రత్యేక విమానం భారత్ కు చేరుకుంది. 219 మంది విద్యార్థులతో హంగేరీ నుంచి బయలు దేరిన విమానం శుక్రవారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది.
ఆపరేషన్ గంగాలో భాగంగా ఆ విమానం హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి గురువారం బయలు దేరింది. న్యూఢిల్లీకి చేరిన భారతీయ పౌరులకు కేంద్ర సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్ స్వాగతం పలికారు.
‘ ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ పౌరులను భారత్ కు తరలించడంలో మేము విజయం సాధిస్తున్నాము. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు నలుగురు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు ” అని అన్నారు.
ఉక్రెయిన్ నుంచి భారత్ కు చేరుకుంటున్న భారత పౌరులు ఉత్సాహంగా, భారత్ పట్ల గౌరవాన్ని కలిగి ఉన్నారు. కేంద్రానికి వారు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నాము” అని పేర్కొన్నారు.