గోదావరి కచ్చులూరు దగ్గర మునిగిపోయిన బోటును బయటకు తీసింది ధర్మాడి సత్యం బృందం. నీటి అడుగుభాగంలో రోప్‌లు తగిలించి బయటకు తీశారు. కాస్సేపట్లో బోటును ఒడ్డుకు చేర్చబోతున్నారు. వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసం కాగా… సెప్టెంబర్ 15న బోటు మునిగిపోయింది. నాటి నుండి ఆపరేషన్ వశిష్ట కొనసాగుతోంది.
అయితే, బోటు బయటకు వస్తున్న కొద్దీ… మృతదేహలు ఒక్కోటిగా లభ్యమవుతున్నాయి. కాకినాడ పోర్టు అధికారి ఆది నారాయణ పర్యవేక్షణలో ఆపరేషన్ వశిష్ట కొనసాగింది.