రాయల్ వశిష్ఠ బోటు వెలికితీత పనుల్లో సత్యం బృందం పురోగతి సాధించింది. రోప్ ల ద్వారా బోటు పైకప్పును బయటకు తీశారు. గోదావరి లో సుడిగుండాలు లేకపోవటం, నీటి మట్టం కూడా క్రమేపి తగ్గుతూ వస్తుండటం సునాయాసంగా పనులు జరుగుతున్నాయి. ఆదివారం విశాఖపట్నం నుంచి అండర్ వాటర్ సర్వీసెస్ కు చెందిన పదిమంది ఈ వెలికితీత పనుల్లో కీలకంగా మారారు. వారిలో నాగరాజు, స్వామి అనే ఇద్దరు బోటు మునిగిన ప్రదేశంలో లోపలి వెళ్లి
ఏవిధంగా బోటును బయటకు తియ్యవచ్చని పరిశీలించారు.ఇసుకలో బోటు కురుకుపోయినట్టు కాకినాడ పోర్ట్ అధికారి ఆదినారాయణ తెలిపారు. బోటు ఏటవాలుగా మునగడం వల్ల ముందు భాగం 40 అడుగుల లోతులో ఉంటె వెనుకభాగం 70 అడుగుల లోతులో కురుకుపోయినట్టు గుర్తించామన్నారు.