కాకతీయ విశ్వవిద్యాయలం ఉపకులపతి ప్రొ.రమేష్ పై హైదరాబాద్ లోకాయుక్తలో ఫిర్యాదు నమోదు అయింది. విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఎన్నిక కావడానికి కనీసం ప్రొఫెసర్ గా 10 సంవత్సరాల అనుభవం ఉండాలని.. ఆ పదవికి ఎన్నికైన రమేష్ కు ఆ అనుభవం లేదని.. వెంటనే అతన్ని తొలగించి.. అన్ని అర్హతలు కలిగిన వారిని నియమించాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
గతంలో నిజామాబాద్ కు చెందిన విశ్రాంత డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా. జీ. విద్యాసాగర్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఇదే విసయంపై రిట్ పిటీషన్ వేశారు. అయితే.. ఫిబ్రవరిలో వేసిన ఈ పిటీషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఫిబ్రవరిలోనే రెండు సార్లు ఈ కేసు హైకోర్టు బెంచ్ మీదకు వచ్చినప్పటికీ.. దానికి సంబంధించిన విచారణ పూర్తీ కాలేదు. అయితే.. హైకోర్టు జడ్జీ డా. జస్టిస్ శమీం అక్తర్ ఈ కేసు విచారణ కొనసాగిస్తున్నారు.
ఇదే నేపధ్యంలో హైదరాబాద్ లోకాయుక్తలో డా. ప్రవీణ్ అనే ప్రైవేట్ ఉద్యోగి ప్రొ.రమేష్ ఎన్నిక చెల్లదని వెంటనే అర్హత కలిగివున్న వారిని వీసీగా నియమించాలని ఫిర్యాదు చేశారు. రాష్త్రం ప్రభుత్వ విద్యా శాఖ కార్యదర్శి 2019లో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతుల నియామకం కొరకు నోటిఫికేషన్ జారీ చేశారని పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ లో ఉపకులపతిగా దరఖాస్తు చేసుకొవడానికి ప్రొఫెసర్ గా 10 సంవత్సరాలు అనుభవం ఉండాలనే నిబంధన ఉందని వివరించారు. అయితే.. కేయూ ప్రొఫెసర్ రమేష్ కు ఆ అనుభవం లేనప్పటికీ దరఖాస్తు చేసుకున్నారని ఫిర్యాదులో వివరించారు.
కాగా.. రమేష్ 2009 లో ప్రొఫెసర్ గా ప్రమోషన్ పొందారని.. రాష్త్రం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది 23.07.2019 కాబట్టి.. ప్రొఫెసర్ గా ప్రమోషన్ తీసుకున్నప్పటి నుండి దరఖాస్తు చివరి తేదీ వరకు ఇంకా 10 సంవత్సరాలు పూర్తీ కాలేదని పూర్తి ఆధారాలుతో కూడిన పిటీషన్ ను దాఖలు చేశారు. అనుభవం లేకుండానే నిబంధనలకు విరుద్దంగా ఉపకులపతి పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం ఉన్నత విదాశాఖ కార్యదర్శి దరఖాస్తులను పరిశీలించడానికి ముగ్గురి సభ్యులతో కూడిన సెర్చ్ కమీటీని నియమించిందని తెలపారు.
ఈ సెర్చ్ కమిటీలో ఉన్న ముగ్గురు సభ్యులు కూడా భాద్యతా రహితంగా వ్యవహరించి అర్హత లేని వ్యక్తిని సిఫార్సు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యూజీసీ 2010 నిబంధలను అడాప్ట్ చేసుకొన్న రాష్ర ఉన్నత విద్య జీఓ నెంబర్ 14 కు విరుద్దంగా ఈ నియామకం జరిగిందని వివరించారు,. గతంలో సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయం ఉపకులపతిని సుప్రీం కోర్టు ఇదే నిబంధనను అతిక్రమించినందుకు పదవి నుండి తొలగించారనె ఉదాహరణను ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిబంధనలకు వ్యతిరేకంగా బాధ్యతాయుతమైన అధికారాన్ని దుర్వినియోగం చేసి అనర్హులను నియమించిన ముగ్గురు సెర్చ్ కమిటీ సభ్యులు, రాష్ట్రం ప్రభుత్వ కార్యదర్శి, ప్రొ. రమేష్.. మొత్తం ఐదుగురిని ఫిర్యాదులో బాధ్యులుగా పేర్కొన్నారు ఫిటీషనర్. వెంటనే ప్రొ. రమేష్ ను వీసీ పదవి నుండి తొలగించి అర్హత కలిగిన వారిని నియమించాలని పేర్కొన్నారు.