పార్లమెంట్‌లో అదానీ వ్యవహారంపై రచ్చ కొనసాగుతోంది. అదానీ సంక్షోభంపై జేపీసీ వేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ రోజు కూడా అదానీ వ్యవహారంపై ఉభయ సభలు దద్దరిల్లాయి. ఈ క్రమంలో ఉభయ సభలు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి.
పార్లమెంట్ భవనంలోని మొదటి అంతస్తులో విపక్ష ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అదానీ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలని నినాదాలు చేశాయి. మొదటి అంతస్తులో పెద్ద బ్యానర్ కూడా కట్టారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేకంగా ఆందోళన చేపట్టారు.
అదానీ అంశంపై ప్రధాని మోడీ మౌనాన్ని వీడాలని టీఎంసీ ఎంపీలు డిమాండ్ చేశారు. అదానీపై విచారణకు ఆదేశించకుండా ఆయకు కేంద్రం సహాయం చేస్తోందని వారు ఆరోపించారు. అదానీని అరెస్టు చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. కాం
కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, శివసేన, జేడీయూ, జేఎంఎం, ఐయూఎంఎల్, ఆప్, ఎండీఎంకే పార్టీలు ప్రతిపక్ష నేత ఖర్గే చాంబర్‌లో సమావేశం అయ్యారు. మరోవైపు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని అధికార పక్షం డిమాండ్ చేస్తోంది.