కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇవ్వడంపై ఇంకా విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ వ్యాక్సిన్‌పై ఆర్జేడీ గొంతు కలిపింది. కరోనా వ్యాక్సిన్ తొలి డోసును ప్రధాని మోదీ తీసుకోవాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఆయన తీసుకున్నాక.. తామంతా వ్యాక్సిన్ తీసుకుంటామని ఆ పార్టీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. బిహార్‌కే చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అజీత్ శర్మ కూడా ఇలాంటి డిమాండే చేశారు. వ్యాక్సిన్‌పై ప్రజల్లో అనుమానాలు తొలగిపోవాలంటే.. రష్యా, అమెరికా అధ్యక్షులు లైవ్‌లో టీకా వేయించుకున్న విధంగా మోదీ కూడా తీసుకోవాలని కోరారు.
ఇక యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా టీకాపై అనుమానాలు వ్యక్తం చేశారు. తాను కరోనా టీకాను తీసుకోబోనని.. అదీ బీజేఈ వ్యాక్సిన్ అంటూ విమర్శించారు. అటు ఇప్పటికే వ్యాక్సిన్ల పనితీరుపై కాంగ్రెస్‌కు చెందిన నేతలు అనుమానం వ్యక్తం చేశారు. హడావుడిగా వ్యాక్సిన్ తీసుకువస్తే.. దుష్పరిణామాలు తప్పవని హెచ్చరించారు.