2లక్షల కోట్ల పైచిలుకు బడ్జెట్ తో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామంటూ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటుంది. ఇది రైతు, పేదల బడ్జెట్ బండి అని సర్కారు చెప్తుంటే… ప్రతిపక్షాలు విస్మయం వ్యక్తం చేశాయి. సర్కార్ గొప్పలకు పోయి… ఇప్పటికే ఉన్న అప్పులకు తోడు మరిన్ని అప్పులు చేస్తుందని మండిపడుతున్నాయి.
కాంగ్రెస్ రియాక్షన్-
కరోనా ఇబ్బందుల సమయంలో 2,30,825 కోట్ల బడ్జెట్ ఎలా ప్రవేశపెడతారని ప్రభుత్వాన్ని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క నిలదీశారు. ఇప్పటికే 3.5 లక్షల కోట్లు అప్పు రాష్ట్రం నెత్తిన ఉందని, ఈ ఏడాది ఆర్థికలోటు 45,509 కోట్లు చూపించారని మండిపడ్డారు. అప్పుల భారాన్ని భారీగా పెంచుతూ పోతున్నారని భట్టి ధ్వజమెత్తారు. లాస్ట్ ఈయర్ ప్రవేశపెట్టిన 1.43 లక్షల బడ్జెట్ లక్ష్యం చేరలేదని… ఇప్పుడు మరింత అంచనాలు ఎలా పెంచారని భట్టి ప్రశ్నించారు.
బీజేపీ రియాక్షన్-
ఇది మేడిపండు మాదిరిగా ఉన్న బడ్జెట్ అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. 2014 నుండి గల్ఫ్ బాధితులు సహాయం కోసం ఎదురు చూస్తుంటే వారి ప్రస్తావనే లేదన్నారు. అంకెలు చెప్తూ… మాయ చేసే ప్రయత్నం చేశారని, అసెంబ్లీలో సర్కార్ అంకెల గారడీని బయటపెడతామన్నారు.