పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో పరిస్థితులు, కరోనా ఎదుర్కొన్న తీరు, వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ ల ఉత్పత్తితో పాటు కేంద్రం చేస్తున్న పథకాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధానంగా ప్రస్తావించారు.
వన్ నేషన్- వన్ రేషన్, ఆరు రాష్ట్రాల్లో ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, మానవత్వంతో దేశీయంగా తయారవుతున్న కరోనా వ్యాక్సిన్లను ఇతర దేశాలకు సహాయం చేయటం, ఆత్మనిర్భర్ భారత్, పరిశ్రమల అభివృద్ధిపై తన ప్రసంగంలో వివరించారు. ఇక రిపబ్లిక్ డే రోజున జరిగిన హింసను ఖండించిన రాష్ట్రపతి, రైతులకు కనీస మద్ధతు ధర కల్పిస్తామన్నారు.
రైతులపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా… దేశంలో 18ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి.