– చరిత్రలో కలిసిపోయిన ఉద్యమ పార్టీ
– టీఆర్ఎస్ కు గుడ్ బై.. బీఆర్ఎస్ కు వెల్ కమ్
– కొత్త పార్టీ చాలా ఘనంగా.. కాస్ట్లీగా!
– తెలంగాణలో సంబరాలు సరే.. కలిసొచ్చేది ఎవరు?
– తెలంగాణలో టపాసులు పేల్చితే దేశమంతా పేలినట్టేనా?
– నార్త్ దాకా ఎందుకు?
– సౌత్ లో కలిసొచ్చే ప్రధాన పార్టీలు ఎన్ని?
– కుమారస్వామి తప్ప పేరు మోసిన లీడర్ ఎవరొచ్చారు?
– మునుగోడులో మద్దతిచ్చిన లెఫ్ట్ పార్టీలే డుమ్మా!
– తమిళనాడు, కేరళను టచ్ చేసే పరిస్థితేది?
– పేడ బిర్యానీ అని ఆంధ్రాని తిట్టి.. ఏ మొహం పెట్టుకుని వెళ్తారు?
– కేసీఆర్ బీఆర్ఎస్ పై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ
తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్రలోకి వెళ్లిపోయింది. ఉద్యమ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ పార్టీ కార్యవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ ఆమోదించారు. కర్నాటక మాజీ ముఖ్యమంతి కుమారస్వామి, ఆయన పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధినేత తిరుమావళన్ తో పాటు పలువురు ఈ భేటీకి హాజరయ్యారు.
జాతీయ పార్టీగా ఎందుకు మారుస్తున్నామో సభ్యులకు వివరించారు కేసీఆర్. అనంతరం టీఆర్‌ఎస్ ను జాతీయ పార్టీగా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తూ.. 283 మంది సభ్యులు సంతకాలు చేశారు. అయితే, కార్యవర్గ సమావేశంలో తీర్మానం మాత్రమే చేశారు గానీ.. ఈసీ ఆమోదించాల్సి ఉంది. దీనికోసం చర్చలకు ఓ ప్రతినిధుల బృందాన్ని ఢిల్లీ పంపారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును రద్దు చేయించి.. భారత్ రాష్ట్ర సమితిగా గుర్తించాలని అందులోని సభ్యులు కోరనున్నారు. ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం అయితే ఈ ప్రక్రియలో ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది.
అయితే, కేసీఆర్ జాతీయ పార్టీపై రకరకాల వాదనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఇది వర్కవుట్ అవ్వదని.. ఆరంభ శూరత్వమేనని ఆరోపిస్తున్నాయి. కొత్త పార్టీ చాలా ఘనంగా.. కాస్ట్లీగా కేసీఆర్ ప్రారంభించుకున్నారని.. తెలంగాణలో సంబరాలు చేస్తే.. దేశమంతా జరిగినట్టా అంటూ సెటైర్లు వేస్తున్నాయి. నార్త్ దాకా ఎందుకు? సౌత్ లో కేసీఆర్ తో కలిసొచ్చే ప్రధాన పార్టీలు ఎన్ని ఉన్నాయని ప్రశ్నిస్తున్నాయి.
కుమారస్వామి తప్ప పేరు మోసిన లీడర్ ఎవరొచ్చారని.. ఆఖరికి మునుగోడులో మద్దతిచ్చిన లెఫ్ట్ పార్టీలే కేసీఆర్ కు ఝలక్ ఇచ్చాయని చురకలంటిస్తున్నాయి. తమిళనాడు, కేరళను కేసీఆర్ టచ్ చేసే పరిస్థితి లేదని.. పేడ బిర్యానీ అని ఆంధ్రాని తిట్టి ఏ మొహం పెట్టుకుని అక్కడకు వెళ్లి ఓట్లు అడుగుతారని ప్రశ్నిస్తున్నాయి.