కేరళ అసెంబ్లీలో శుక్రవారం హైడ్రామా నెలకొంది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం మధ్య “అపవిత్ర పొత్తు” ఉందని ఆరోపిస్తూ ప్రతిపక్ష సభ్యులు హాల్ నుండి వాకౌట్ చేశారు. అనంతరం వారు అసెంబ్లీ బయట నిరసనలు తెలిపారు.
బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించేందుకు అసెంబ్లీలోకి గవర్నర్ ఆరిఫ్ ఖాన్ వచ్చారు. వెంటనే కాంగ్రెస్ నేతలు లేచి ‘ గవర్నర్ గో బ్యాక్” అంటూ నినాదాలు చేశారు.
గవర్నమెంట్ – గవర్నర్ అపవిత్రమైన పొత్తు నశించాలి అని రాసివున్న ప్లకార్డులను పట్టుకుని కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలిపారు. అనంతరం హౌస్ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు నేతలు ప్రకటించారు.
\కన్నూర్ వర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గోపీనాథ్ రవీంద్రన్ పునర్ నియామకంపై చర్చజరపాలని డిమాండ్ చేశారు. దీనిపై అసహనానికి గురైన గవర్నర్ మాట్లాడుతూ.. ‘ మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత. మీకు దీనిపై చర్చించేందుకు సమయం వస్తుంది. మీరు ఇలా ప్రవర్తించడం సరికాదు” అన్నారు.