బొజ్జ గణపయ్యకు ఎన్నో రూపాలు…భక్తితో ఎన్నో సేవలు..ఎన్నెన్నో నైవేద్యాలు…!! భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా నవరాత్రి వేడుకల్లో వివిధ వినాయక రూపాలు అలరిస్తున్నాయి. కొందరు కరెన్సీతో…మరికొందరు నెమలి పింఛాలతో, కొందరు కూరగాయలతో.. ఇంకొందరు డ్రై ఫ్రూట్స్‌తో ఇలా తమకు తోచిన విధంగా గణేషుడిని రూపొందించి పూజిస్తున్నారు.
ప్రపంచంలో ఆరెంజ్ కేపిటల్‌గా పేరొందిన హాలెండ్‌లో కూడా స్థానికులు ఏటేటా వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఆరెంజ్ పండ్లతో బొజ్జ గణపయ్యను సర్వాంగ సుందరంగా అలంకరించి స్థానికులు భక్తితో కొలుస్తున్నారు. తమ తోటల్లో పండిన ఆరెంజ్ పండ్లతో ఇలా ఏటా గణపయ్యను అలంకరించడం వారి భక్తి ఆచారం..! ఆరెంజ్ గణపయ్య అలంకారం అదుర్స్…! హాలెండ్ వాసులూ హ్యాట్సాప్…!!