రాష్ట్రంల వరిసాగు చేస్తున్న రైతుల పరిస్థితి ఇప్పుడు కుడితిలవడ్డ ఎలుక తీరు అయింది. ముందుకువోతె నుయ్యి… ఎనకకువోతె గొయ్యి అన్నట్టైంది. యాసంగికి వరిసాగు చెయ్యొద్దని సర్కారు చెప్తుంది. అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు వరిసాగు చేసే రైతులకు బ్యాంక్ లోన్లు కూడా ఇయ్యొద్దన్నట్టు తెలుస్తోంది. దీంతో లోన్ కోసం బ్యాంకులకు పోయిన రైతులకు ఎదుదెబ్బ తగులుతుంది. కొన్ని బ్యాంకులల్ల పంటల వివరాలు అడగడమే కాకుండా… ఫీల్డ్ ఆఫీసర్లను ఎంక్వైరీకి తోలుతున్న పరిస్థితి. ప్రభుత్వం వరిసాగు చెయ్యొద్దంటే వరిసాగుకు రుణం ఎట్ల ఇస్తం అనుకుంటున్నరు అని బ్యాంక్ అధికారులు రైతులను ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏర్పడింది.
యాసంగి పంటకు ఇంకా సంబదించిన లెక్క ఇంకా తేలనే లేదు. వానాకాలంల 61.94 లక్షల ఎకరాలల్ల వరిసాగు చేసిర్రు రైతులు. 2020 యాసంగిల 52.78 లక్షల వరిసాగైంది. కానీ.. ఇప్పుడు వరిపంట వెయ్యాలెనా..? వద్దా..? అన్న ఆలోచనల రైతన్నలు కొట్టుమిట్టాడుతున్నరు.