తెలిసి తెలియని వయసు …లోకజ్ఞానం అసలే తెలియని అమాయకులు తల్లిదండ్రులు మందలించారని ఇల్లు వదలి పారిపోయి వచ్చిన చిన్నారులు ,ఆకలేస్తే బిక్షాటన తప్పు మరేమీ తెలియని వారు ఒక విచిత్రం మత్తు మందుకు బానిసలుగా మారుతున్నారు. అది కాగితాల పై అక్షరాల్ని చెరిపివేసేందుకు వాడే రసాయనం.(ఏరాజ్ ఎక్స్)అదే వారిపాలిట యమపాశం అవుతోంది. అక్షరాల బదులు వారి జీవితాలనే చెరిపివేస్తున్నాయి. అది సిరామిక్ హైరాన్ లాంటి విషపదార్దం కాకపోయినా నెమ్మదిగా వాటి వైపు లాక్కుపోయో యమపాశం…ఇందులో విషరసాయనం ఉందని అది తమను త్వరగా మృత్యువుకు చేరువ చేస్తోందని తెలుసుకోనే లోపే వారి జీవితం నాశనమవుతోంది. ఇంకును చెరిపివేసి కాగితాన్ని తెల్లగా చేసేందుకు ఉపయోగించే ఈ రసాయనంలో రెండు సీసాలు ఉంటాయి. ఒకటి తెల్లరంగు ద్రవం కాగా మరోకటి గడ్డ ద్రవాన్ని కలిగించేందుకు వాడే రసాయనం .ఎలా అలవాటు చేసుకుంటారో తెలియదు గాని…పది నుంచి ఇరవై ఏళ్ళలోపు దీనికి బానిస లౌవుతున్నారు. ముఖ్యంగా వీదిబాలలు ,బాల కార్మికులు ఈ రసాయనం రుచి మరిగి తమ జీవితాలను నాశనం చేసుకొంటున్నారు. మార్కెట్లో ఇరవై ఐదు రూపాయలకు దొరికే ఈ రసాయనం పిల్లలను ఇంతగా ఎందుకు ఆకర్షిస్తుందో అర్దంకాని పరిస్థితి. తల్లిదండ్రులు మందలించారని ఇళ్ళలో నుంచి వచ్చిన వీధి బాలలు తమ ఆకలి చంపుకొనేందుకు దీన్ని తీసుకొంటున్నట్లు తొలి వెలుగు పరిశీలనలో తేలింది.
…..రెండు తెలుగు రాష్టాలలోని రైల్వేస్టేషన్ ,బస్టాండ్ లలో విధమైన వీది బాలలు ఏక్కువగా ఈ రసాయనాన్ని ఏక్కువగా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా గంజాయి కొత్త కూడా అలవాటు పడుతున్నారు. లాక్ డౌన తో మద్యం దొరక్క ఇటీవల పిల్లలే కాదు పెద్దలు ఈ రసాయనం కొనుగోలు చేసి మత్తు నింపుకుంటున్నారు.
ఏలా వినియోగిస్తారంటే….
వీధి బాలలు రైల్వే ,బస్టాండ్ లలో బిక్షాటన చేసిన డబ్బుతో ఏ ఫ్యాన్సీ దుకాణంలోనైనా దొరికే ఈ రసాయనం కొంటారు.దీన్ని ఓ వస్త్రంలో వేసుకుని నోటితో పీలుస్తారు. కొందరైతే సీసానే ముక్కు వద్ద ఉంచుకొని పీల్చి మత్తు పొందుతున్నారు.ఇలా మద్యంకు డబ్బులు లేని వారు సైతం ఈ రసాయనం ను వాడుతున్నారు.వీటి సేల్ కూడ బాగ పెరిగిందని పలువురు వ్యాపారు చెబుతున్నారు. అంతే కాదు దీనికి అలవాటు పడిన వారు అన్నం తినకపోయిన ఈ మత్తు మందు లేనిది బతకలేము అనేలా వున్నారు.ఇంకును చెరిపేందుకు వాడే ఎరాజ్ఎక్స్ అనే రసాయనంలో టోలిన్ ఉండటం వలన దానిని తీసుకోగానే శరీర అవయాలు పాడవుతాయి.నరాల్లో శక్తి నశిస్తుంది. ఉపరితిత్తుల్లోని గాలి గదులు మూసుకుపోతాయి. పెరాల్ సిస్ , క్యాన్సర్ వంటి రోగాల బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు చేబుతున్నారు.