ఓఆర్ఆర్ వెంబడి 23 కిలో మీటర్ల సైక్లింగ్ ట్రాక్ మరికొద్దిరోజుల్లోనే అందుబాటులోకి రానుందని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు . శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించి, శారీరక దృఢత్వం పెరిగే విధంగా జీహెచ్ఎంసీ సైక్లింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ ట్రాక్ లు కొన్ని చోట్ల తాత్కాలికంగా, మరికొన్ని చోట్ల శాశ్వతంగా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు.
ఇందుకు సంబంధించిన ట్రాక్ పనుల ఫొటోలను అరవింద్ కుమార్ శనివారం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్ ల ఏర్పాటును ఆశించే సమయంలో ట్రాక్ లో పచ్చదనం, ల్యాండ్ స్కేపింగ్ సంబంధిత పనులు చేపట్టినట్లు ఆయన వివరించారు.
అలాగే నగర వ్యాప్తంగా ఎంపిక చేసిన జోన్లలో సుమారు 90 కిలోమీటర్లు పొడవులో సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే కొన్ని చోట్ల ఇప్పటికే ట్రాక్ లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ క్రమంలోనే ఔటర్ రింగ్ రోడ్ వెంబడి సోలార్ రూఫింగ్ తో 23 కిలో మీటర్ల పొడవున్న సైక్లింగ్ ట్రాక్ దాదాపుగా పూర్తి కావడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు అరవింద్ కుమార్.
Cycle track along with #ORR
-Civil works nearing completion
– greenary & landscaping works started
– solar panelling finalised and works on installation to begin in next 10 daysOnce completed, it’s going to be one of its kind in India @KTRBRS pic.twitter.com/jyekS1I3uk
— Arvind Kumar (@arvindkumar_ias) March 11, 2023