ప్రపంచ సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం ఆస్కార్. సినీ అభిమానులు కూడా ఈ అవార్డుల వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అవార్డు అందుకోవడమే కాదు, అవార్డుకు నామినేట్ అయితే చాలనుకునే సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చాలా మంది ఉన్నారు. అయితే, ఎంతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆస్కార్-2022’94వ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డాల్బీ థియేటర్స్ వేదికగా ఈ అవార్డుల వేడుక జరగుతోంది.
అయితే ఆస్కార్ చరిత్రలో తొలిసారి అత్యుత్తమ చిత్రం రేసులో 10 చిత్రాలు పోటీ పడ్డాయి. అలాగే, ఈసారి అవార్డుల వేడుకను అమీ షుమెర్, వాండా సైక్స్, రెజీనా హాల్ అనే ముగ్గురు మహిళా యాంకర్స్ హాస్ట్ చేయనున్నారు. ఇలా ముగ్గురు మహిళలు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హోస్ట్‌గా వ్యవహరించడం కూడా ఇదే తొలిసారి.
ఇక ఈసారి ఈ అత్యుతమ పురస్కారం ఎవరిని వరించిందో ఇప్పుడు చూద్దాం..
ఉత్తమ నటుడు: విల్ స్మిత్ – కింగ్ రిచర్డ్ మూవీ
ఉత్తమ నటి: జెస్సికా చస్టీన్ – ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫాయే మూవీ
ఉత్తమ సహాయ నటుడు: ట్రాయ్ కాట్‌సర్ – కోడా మూవీ
ఉత్తమ సహాయ నటి: అరియనా డిబోస్ – వెస్ట్ సైడ్ స్టోరీ
ఉత్తమ దర్శకుడు: జేన్ కాంపియన్ – ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’ సినిమా
ఉత్తమ చిత్రం: కోడా
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: డ్రైవ్ మై కార్
ఉత్తమ యానిమేషన్ చిత్రం: ఎన్‌కాంటో
ఉత్తమ యానిమేషన్ లఘు చిత్రం: ది విండ్ షీల్డ్ వైపర్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ద లాంగ్ గుడ్ బై
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్: సమ్మర్ ఆఫ్ సోల్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: కెనత్ బ్రానో – బెల్ ఫాస్ట్ మూవీ
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: షాన్ హైడర్ – కోడా మూవీ
ఉత్తమ ఛాయాగ్రహణం: గ్రీగ్ ఫ్రైజర్ – డ్యూన్ మూవీ
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: ప్రాక్టీస్ వెర్మీట్టే, సుసానా సిపీస్
విజువల్ ఎఫెక్ట్స్: పాల్ లాంబర్ట్, ట్రిస్టన్ మైల్స్, బ్రియాన్ కానర్, గెర్డ్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్: హన్స్ జిమ్మర్ – డ్యూన్ మూవీ
బెస్ట్ ఒరిజినల్ సాంగ్: నో టైమ్ టు డై మూవీ టైటిల్ సాంగ్
బెస్ట్ సౌండ్: మాక్ రూత్, మార్క్, థియో గ్రీన్, డౌగ్ హెంఫిల్, రోన్ బార్ట్లెట్ – డ్యూన్
బెస్ట్ ఎడిటింగ్: జో వాకర్ – డ్యూన్ మూవీ
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: జెన్నీ బివాన్ – క్రూయెల్లా మూవీ