గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల సంబరం ప్రారంభమైంది. 95వ ఆస్కార్ వేడుకలు ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈసారి నామినేషన్లలో రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం నుంచి నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నిలిచింది.
ఇప్పటికే ఈ వేడుకల కోసం ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ బృందం కొద్ది రోజుల క్రితమే అమెరికాకు చేరుకున్నారు. మరి కాసేపట్లో నాటు నాటు సాంగ్ పాటను అద్భుతంగా ఆలపించిన సింగర్లు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఇద్దరూ కూడా ఆస్కార్ వేదికపై లైవ్ ఫెర్మామెన్స్ ఇవ్వనున్నారు. కాగా ఈ వేడుకల్లో నాటునాటు పాటకు తారక్, చరణ్ స్టెప్పులేస్తారని అందరూ అనుకోగా..వారికి సమయంలేనందున ఆ పాటకు డ్యాన్స్ చేసే అవకాశాన్ని అమెరికన్ నటి లారెన్ గాట్లిబ్ స్టెప్పులేయనుంది.
ఈ వేడుకలకు చరణ్, రాజమౌళి, కీరవాణి వారి సతీమణులతో హాజరయ్యారు. రాజమౌళి, హీరోలు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ దుస్తుల్లో ముస్తాబయ్యారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చరణ్, భార్య ఉపాసనతో కలిసి అక్కడి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ..కొంచెం భయంగా ఉందని చెప్పగా, చరణ్ ఆమె ఆరు నెలల గర్భవతని అక్కడి యాంకర్లకు చెప్పగా వారు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు వేడుకల ప్రజెంటర్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణే అరుదైన గౌరవం దక్కించుకుంది. ఇందుకోసం ఆమె బ్లాక్ డ్రెస్‌లో ఆస్కార్ వేడుకకు విచ్చేసింది.
ఆస్కార్ వేదిక పై తారక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ప్రత్యేకమైన దుస్తుల్లో మెరిశారు. ఆయన ధరించిన సూట్ పై గర్జిస్తున్న పులి బొమ్మ ఆకట్టుకుంటుంది. నాటు నాటు పాట కచ్చితంగా ఆస్కార్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిమ్మి కిమ్మెల్. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డు దక్కించుకున్న పినాకియో. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఆస్కార్ అందుకున్న కీ హుయ్ క్వాన్ (ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్).
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ కి జామీ లీ కర్టిస్ గెలుచుకుంది. వేదికపై అవార్డ్ అందుకున్న జామీ లీ.. చిత్రయూనిట్ తోపాటు.. తనకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. తన కుటుంబానికి ప్రేమతో ధన్యవాదాలు తెలిపింది జామీ లీ.
ఉత్తమ డాక్యుమెంటరీఫీచర్ ఫిల్మ్‌గా నవాల్నీఎంపికయ్యింది. ఈ విభాగానికి భారత్ నుంచి పోటీపడ్డ ఆల్ దట్ బ్రీత్స్. కానీ ఆస్కార్ అవార్డును దక్కించుకోలేకపోయిన ఆల్ దట్ బ్రీత్స్. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌గా ఎంపికైన ఎన్ ఐరిఫ్ గుడ్ బై.
జర్మన్ యుద్ధ వ్యతిరేక చిత్రం ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ ఉత్తమ సినిమాటోగ్రఫీకి ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.ఉత్తమ సినిమాటోగ్రఫీ ఆస్కార్ అవార్డ్ జేమ్స్ ఫ్రెండ్ కు అందుకున్నారు. ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ చిత్రానికి ఈ అవార్డ్ అందుకున్నారు జేమ్స్ ఫ్రెండ్.
ఈ అవార్డ్ కోసం డారియస్ ఖోండ్జ్..”బార్డో, ఫాల్స్ క్రానికల్ ఆఫ్ ఎ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ట్రూత్స్”, మాండీ వాకర్.. “ఎల్విస్”, రోజర్ డీకిన్స్.. “ఎంపైర్ ఆఫ్ లైట్”, ఫ్లోరియన్ హాఫ్‌మీస్టర్.. “తార్” పోటి పడ్డారు.
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా గులెర్మో డెల్ టోరోస్ పినోచియో చిత్రం అవార్డ్ గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం మార్సెల్ ది షెల్ విత్ షూస్ ఆన్, పస్ ఇన్ బూట్స్: ది లాస్ట్ విష్, ది సీ బీస్ట్, టర్నింగ్ రెడ్ పోటీ పడ్డాయి.
ది వేల్‌కి మేకప్, హెయిర్‌స్టైల్‌కి అవార్డుని ముగ్గురు అందుకున్నారు. అడ్రిన్ మొరోట్, జుడీ చిన్, అన్నీమేరీ బ్రాడ్లీ.ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ చిత్రం ఆస్కార్ దక్కించుకుంది. ఈ అవార్డ్ కోసం “బాబిలోన్”, “బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్”, “ఎల్విస్”, “ఎవరీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్”, “మిసెస్ హారిస్ గోస్ టు ప్యారిస్” చిత్రాలు పోటీపడ్డాయి.