ఆస్కార్ అవార్డు ఒక్కసారి అయినా టచ్ చేయాలి అనుకుంటారు నటులు. ఆ అవార్డు కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతటి నటుడికి అయినా సరే ఆస్కార్ అనేది కల అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన భారతీయులకు ఇది కాస్త దూరం అనే చెప్పాలి. ఏ ఆర్ రహమాన్ కు ఆస్కార్ వచ్చినప్పుడు అప్పట్లో సంచలనం చేసారు. అప్పటి వరకు మనకు మూడు సార్లు మాత్రమే వచ్చింది.
ఇక ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు ఈ ఏడాది ఆస్కార్ అవార్డుని దక్కించుకున్నాయి. ఒకటి తమిళ డాక్యుమెంటరి కాగా రెండు మన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఈ అవార్డు వచ్చింది. అయితే అవార్డు సాధించిన తమిళ నిర్మాత గునీత్ మంగా గురించి చాలా మందికి తెలియదు. ఆమె 2019 లో కూడా ఆస్కార్ దక్కించుకున్నారు. ఎలిఫెంట్ విస్పరర్స్ అనే తమిళ డాక్యుమెంటరి కి ఇప్పుడు అవార్డు వచ్చింది.
2019లో పీరియడ్ : ఎండ్ ఆఫ్ సెంటెన్స్ కూడా ఆమెకు ఆస్కార్ వచ్చింది. ఆమె గురించి పెద్దగా మీడియా హడావుడి చేయలేదు. జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. తల్లి తండ్రుల నుంచి, ఆమె తోడబుట్టిన వాళ్ళ నుంచి ఎన్నో ఇబ్బందులు పడింది. వీధుల్లో జున్ను కూడా అమ్మింది. ఆ తర్వాత అనేక కష్టాలు పడి డీజేగా కూడా పని చేసింది. క్రౌడ్ ఫండ్ తో సినిమాలు చేసి ఇప్పుడు ఆమె ఆస్కార్ సొంతం చేసుకుంది.