రెండు, మూడు రోజుల కింద కూడా ఆస్కార్ అవార్డుపై చాలా ఉత్కంఠ నెలకొంది.ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ అనుచిత వ్యాఖ్యలు చేసారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
చాలా విమర్శలను సైతం ఎదుర్కొన్నారు తమ్మారెడ్డి. ఇక ఇవాళ ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ అవార్డు దక్కడంపై తమ్మారెడ్డి భరద్వాజ రియాక్షన్ ఎలా ఉంటుందనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే దీనిపై తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఓ వీడియో విడుదల చేస్తూ ‘నాటు నాటు’ ఆస్కార్ సాధించడం పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ‘నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం చాలా గర్వంగా ఉంది. నాకే కాదు.. సినిమాను ప్రేమించే వారికి, సంగీతాన్ని ప్రేమించే వారికి ఈ పాటకు ఆస్కార్ దక్కించుకోవడం గర్వించదగ్గ క్షణమేనని అన్నారు.
మనకు తెలుగు సినిమాల్లో తెలుగు సంగీతాన్ని, తెలుగుదనాన్ని అందించే తక్కువ సంగీత దర్శకుల్లో కీరవాణి గారు ఒకరు. అలాగే తెలుగు సాహిత్యం బాగా తెలిసిన చంద్రబోస్, కీరవాణి ఒకటి కావడంతో ఆస్కార్ రావడం సంతోషం.
తొలిసారిగా ఇండియన్ సినిమాకు రావడం.. అందులోనూ మన తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం ఆనందంగా ఉంది.ఈ సందర్భంగా కీరవాణి, చంద్రబోస్, ఎస్ ఎస్ రాజమౌళి, ఆర్ఆర్ఆర్ టీమ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలను తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.