బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందే ఆసీస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో తొలి టెస్ట్‌కు పేసర్ జోస్ హేజిల్‌వుడ్ దూరమయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9న ప్రారంభంకానుంది.ఇప్పటికే నాగ్‌పూర్ చేరుకున్నఇండియా, ఆస్ట్రేలియా టీమ్‌లు ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. అయితే తొలి టెస్ట్‌కు ఆస్ట్రేలియా పేసర్ జోస్ హేజిల్‌వుడ్ దూరమయ్యాడు.
ఎడమకాలి మడమ గాయంతో తొలి టెస్ట్ ఆడటం లేదని హేజిల్‌వుడ్ ప్రకటించాడు. గత నెల సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో గాయం బారిన పడ్డాడుహేజిల్‌వుడ్. మడమ గాయం ప్రభావం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో నాగ్‌పూర్ టెస్ట్ ఆడటం లేదని తెలిపాడు.
ప్రస్తుతం ఆసీస్ తరఫున ప్రధాన పేసర్స్‌లో ఒకడిగా జోస్ హేజిల్‌వుడ్ కొనసాగుతోన్నాడు.అతడు దూరం కావడం ఒక రకంగా ఆస్ట్రేలియాకు లోటు అని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
జోస్ హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇండియాతో జరుగనున్న ఈ టెస్ట్‌తోనే బోలాండ్ అరంగేట్రం చేయనున్నాడు. రెండో టెస్ట్‌కు జోస్ హేజిల్‌వుడ్ అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.