కోరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో …థియేటర్ల క్లోజ్ కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో న్యూ డైరెక్టర్స్ , యాక్టర్స్ తమ సినిమాలను OTT ద్వారా విడుదల చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలా 2020లో OTT లో ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిన కొన్ని సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం!
1) విశ్వక్ సేన్ ( HIT )
ఫలక్ నుమా దాస్ సినిమాతో నటుడిగా మంచి మార్కులు తెచ్చుకున్న విశ్వక్ …2020లో HIT తో కూడా ఆడియన్స్ ను మెప్పించగలిగాడు
2) నవీన్ చంద్ర ( భానుమతి & రామకృష్ణ)
అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్ర కూడా 2020లో భానుమతి & రామకృష్ణ సినిమాతో ఆడియన్స్ ను OTT ద్వారా ఎంటర్ టైన్ చేశాడు.
3) సుహాస్ ( కలర్ ఫోటో )
షార్ట్ ఫిల్మ్స్ , సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసే సుహాస్ కలర్ ఫోటో సినిమాతో మంచి సక్సెస్ కొట్టాడు
4) సత్యదేవ్ ( ఉమామహేశ్వర ఉగ్రరూపస్య)
నటుడిగా తన పాత్రకు 100 శాతం జస్టిఫై చేసే సత్యదేవ్ ….కొరోనా టైమ్ లో కూడా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో OTT ద్వారా సినిమా లవర్స్ ను ఎంటర్ టైన్ చేశాడు.