తెలంగాణ గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్‌ఎస్ పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఓయూ ఎన్ సీసీగేట్ వద్ద ఓయూ జేఏసీ నాయకుడు సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమ ద్రోహి అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులను పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే కేటీఆర్ సంబరపడుతున్నారు.
అయ్యా కేటీఆర్.. నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు, మీ అయ్య తాగి ఫామ హౌస్‌లో పడిపోయినప్పుడు… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆశాజ్యోతి అయినటువంటి ఈటల రాజేందర్ ఉద్యమాన్ని ముందుకు నడిపించి తెలంగాణను సాధించిన విషయం మర్చిపోయావా?
ఉద్యమం సమయంలో ఆంధ్రోళ్ల మోచేతి నీళ్లు తాగి ఉద్యమకారులను తిట్టి వారి మీద దాడి చేసిన వాడికి నువ్వు టికెట్ ఇచ్చినావు. గవర్నర్ ని పట్టుకుని తిడుతుంటే మీరు సంబరపడుతున్నారు.. మీకు కూడా ఏదోక రోజు ఇదే పరిస్థితి ఎదురవుతుంది.
ఇప్పటికైనా కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి. వెంటనే చర్యలు తీసుకోవాలి. అతని మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. లేకపోతే జరిగే పరిణామాలు వేరేగా ఉంటాయని వారు హెచ్చరించారు.