సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నేతలంతా శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రగతి భవన్ కు క్యూ కట్టారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని విద్యారంగంలో ఉన్న సమస్యలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థి సంఘాలు ప్రగతి భవన్ ను ముట్టడించాయి.
కొత్త ఉద్యోగాల ప్రకటన, నిరుద్యోగ భృతి, రాష్ట్రంలో వర్సిటీలకు వీసీల నియామకం చేపట్టాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు. కేసీఆర్ మాటలు మాని చేతలు ప్రారంభించాలని మండిపడ్డారు.