ఓయూలో టీఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీ లు దగ్ధం చేశారు విద్యార్థులు. ఫిబ్రవరి 17 న కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ఓయులో టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను నేడు ప్రారంభించనున్నారు. ఈ టోర్నమెంట్ ను మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి ప్రారంభించనున్నారు.
అయితే వారిని అడ్డుకునేందుకు విద్యార్థి నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఓయులో వెలసిన ప్రతినిధుల ఫ్లెక్సీలను చింపివేసి దగ్ధం చేశారు. ఫ్లెక్సీ లను తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు వేసిన తర్వాతనే ఓయూ లో అడుగుపెట్టాలని విద్యార్థులంతా కూడా డిమాండ్ చేశారు. ఓయూలో అడుగుపెడితే అడ్డుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద పెట్రోల్ పోసుకున్న ఓ విద్యార్థి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి టీఆర్ఎస్ నాయకులు రావాలని విద్యార్థి డిమాండ్ చేశాడు. ఆ తరువాత పోలీసులు విద్యార్థిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ ను తరలించారు.