ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఓయూ విద్యార్థి నేత, టీఆరెఎస్ అధికార ప్రతినిధి కొండల్ ప్రజాపతి తీవ్రంగా గాయపడ్డారు. నల్గొండలోని స్వస్థలానికి వెళ్లి వస్తూ పెద్ద అంబర్ పేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో కొండల్ కారు అదుపు తప్పినట్లు తెలుస్తోంది.
తలకు బలమైన గాయాలు కావటంతో కొండల్ ప్రస్తుతం కోమాలో ఉండగా, పక్కనే ఉన్న స్నేహితుడు ఉదయ్ స్వల్ప గాయాలతో భయటపడ్డారు. కొండల్ స్వగ్రామం చండూరు మండలం గుండ్రామ్ పల్లి కాగా, ఆయనకు భార్య ఇద్దరు కుమారులున్నారు. కొండల్ ప్రజాపతి కోమాలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు ఉదయ్ తెలిపాడు.