నయీమ్ బాల్క సుమన్ రూపంలో బతికే ఉన్నాడని ఓయూ విద్యార్ధి సురేష్ యాదవ్ ఎద్దేవా చేశారు.పత్రికా సమావేశంలో బాల్కసుమన్ కు వ్యతిరేకంగా మాట్లాడాము అనే ఉద్దేశంతోనే బాల్క సుమన్ అనుచరులు తమకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించి బెదిరింపులకు పాల్పడ్డారని ఓయూ విద్యార్థి సురేష్ యాదవ్ అన్నారు.
దీని గురించి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో తెరాస ఎమ్మెల్యే బాల్కసుమన్ అనుచరులపై ఫిర్యాదు చేసినట్లు వారు వెల్లడించారు. బెదిరింపులకు గురైన ఓయూ విద్యార్థి సురేష్ యాదవ్, తెలంగాణ ఉద్యమకారుడు నవీన్ మాట్లాడుతూ.. మొన్న జరిగిన పత్రిక సమావేశంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారులందరికీ బెయిల్ మంజూరు చేసిన వ్యక్తి .
దాంట్లో బాల్క సుమన్ కుకూడా ఈటల రాజేంద్ర బెయిల్ మంజూరు చేశారు. దాని గురించి మాట్లాడినందుకు బాల్క సుమన్ అంచులు అర్ధరాత్రి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించి బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు.విద్యార్థి నాయకునిగా గెలిచి ఎమ్మెల్యే అయిన నువ్వు ప్రభుత్వానికి విద్యార్థులకు వారధిగా వ్యవహరించాల్సిన నువ్వు విద్యార్థులను ఈ విధంగా బెదిరించడం తగదన్నారు.
ఈ బెదిరింపులతో తమకు ప్రాణహాని ఉందని, ఫోన్ లో బెదిరింపుకు పాల్పడ్డ బాల్క సుమన్ అనుచరులు అయిన టీఆర్ ఎస్వీ నాయకులను వెంటనే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.