సినీ ఇండస్ట్రీలో ఒకరు క్లిక్ అయితే వాళ్ళ తమ్ముళ్ళు, అన్నలు మనవళ్ళు మనవరాళ్ళు ఒక్కొక్కరుగా సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. హీరోయిన్లు కూడా తమ క్రేజ్ ని చెల్లెళ్ళకు, అన్నలకు అందిద్దాం అని చూస్తారు.
దురదృష్ట వశాత్తు కొత్తమంది క్లిక్ అవుతారు. కొందరు కాలేరు. అలా ముగ్గురుకి ముగ్గురూ క్లిక్ అయిన వాళ్ళలో నటి నగ్మా చెల్లెళ్ళని చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో నటించిన ఏకైక హీరో చిరంజీవి.
తెలుగు చిత్ర రంగంలో ఘరానా మొగుడు చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, నగ్మా నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వీరిద్దరూ పంచ్ డైలాగులతో పసందైన వినోదాన్ని పంచారు.
ఠాగూర్ సినిమాలో మొదటి చెల్లెలు జ్యోతిక, మాస్టర్ చిత్రంలో రెండో చెల్లెలు రోషిణి, ఇద్దరూ మెగాస్టార్ తో నటించారు. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి.
ఈ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మాస్టర్ సినిమా చిరంజీవి కెరీర్న్ మరో మెట్టు ఎక్కిస్తే..ఠాగూర్ సినిమా చిరంజీవి రాజకీయ అరంగేట్రానికి ఊతమిచ్చింది.
Also Read: రైటర్స్ గా వచ్చి నటులుగా మారింది ఎవరంటే…?