తెలంగాణ ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నర్సింగ్ ఆఫీసర్స్ ఆందోళనకు దిగారు. నల్లబ్యాడ్జీలు, నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. నర్సింగ్ పోస్టులను ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై ప్రభుత్వమే చొరవ తీసుకుని 3,311 నర్సు పోస్టులను భర్తీ చేయాలని కోరారు. న్యాయం అలస్యమైతే తమకు అన్యాయం చేసినట్టే ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా పోరులో అమరులైన డాక్టర్ నరేష్, నర్సింగ్ ఆఫీసర్ జయమణి గారికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా వెంటనే ప్రకటించాలని నర్సింగ్ ఆఫీసర్స్ డిమాండ్ చేశారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు 500 గజాల ఇంటి స్థలాన్నిఇవ్వాలని కోరారు. అలాగే వారి పిల్లల సంరక్షణను బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు.