జూలైలో యూపీఐ ఆరు బిలియన్ల లావాదేవీలను నమోదు చేయడంపై ప్రధాని మోడీ ప్రశంసించారు. ఇది అత్యుత్తమ మైన విజయమని ఆయన కొనియాడారు.
ఇది కొత్త టెక్నాలజీని స్వీకరించడానికి, పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రజల సమిష్టి సంకల్పాన్ని సూచిస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
‘యుపీఐ జూలైలో 6 బిలియన్ల లావాదేవీలను నమోదు చేసింది. 2016 నుంచి ఇదే అత్యధిక లావాదేవీలు’అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అని ట్వీట్ చేశారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ పై ప్రధాని మోడీ స్పందించారు. ఇదో అద్భుతమైన విజయమన్నారు. ఇది కొత్త సాంకేతికతలను స్వీకరించడానికి, పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి భారతదేశ ప్రజల తీసుకున్న సమష్టి సంకల్పాన్ని సూచిస్తుందన్నారు.