2018-20 మధ్య ఇండియన్ ఆర్మీలో సుమారు లక్షకు పైగా మందిని రిక్రూట్ చేసినట్టు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఆ సమయంలో మొత్తం 1,34,003 మందిని సైన్యంలో నియామకమైనట్టు తెలిపారు.
రాజ్యసభలో సోమవారం మాట్లాడిన ఆయన ఈ మేరకు విషయాలను వెల్లడించారు. 2020-21, 2021-22లలో కరోనా నేపథ్యంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ను తాత్కాలికంగా రద్దు చేసినట్టు వెల్లడించారు.
ఆయన లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాచారం మేరకు 2018-19 నుంచి 2021-22 మధ్య నావికా దళంలో 20,272 మందిని నియమిమంచారు.
అదే సమయంలో భారత వైమానిక దళంలో 27,116 మంది నియమించినట్టు తెలిపారు. భారత సాయుధ దళాల్లో సిబ్బంది కోరతను తీర్చేందుకు గాను వాటికి సరిపడేలా నియామకాలు చేపట్టినట్టు పేర్కొన్నారు.
కేవలం కరోనా వల్లనే ఇండియన్ ఆర్మీలో రిక్రూట్ మెంట్ ను తాత్కాలికంగా ఆపివేశామని, నియామకాలను కేంద్రం ఆపలేదని కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు.