ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించిన నుంచి ఇప్పటి వరకు 1 మిలియన్ కు పైగా పిల్లలు ఉక్రెయిన్ నుండి పొరుగు దేశాలకు పారిపోయారు. ఈ విషయాన్ని యునిసెఫ్ వెల్లడించింది.
వీరిలో ఎక్కువ మంది తమ కుటుంబాలతో కలిసి పోలాండ్, హంగేరీ, స్లో వాకియా, మోల్డోవా, రొమానియాలకు పారిపోయారని యునిసెఫ్ యూరప్, మధ్య ఆసియా దేశాల ప్రాంతీయ డైరెక్టర్ అఫ్ షాన్ ఖాన్ తెలిపారు.
‘ ఉక్రెయిన్ నుంచి పెద్ద ఎత్తున పిల్లలు పారిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఉక్రెయిన్ లోని పిల్లలు, కుటుంబాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది” అని అన్నారు.
‘ ఇప్పటి వరకు, దాదాపు 70 టన్నుల సహాయ సామాగ్రితో ఆరు ట్రక్కులు ఉక్రెయిన్‌కు చేరుకున్నాయి. సామాగ్రిలో వ్యక్తిగత రక్షణ పరికరాలు, వైద్య, శస్త్రచికిత్స, ప్రసూతి కిట్‌లు ఉన్నాయి” అని తెలిపారు.