కృష్ణానదికి మళ్లీ వరదనీరు పోటెత్తుతోంది. నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు దగ్గర ఒక్కసారిగా ఉద్ధృతి ఎక్కువైంది. ఈ క్రమంలో ఇసుక కోసం నదిలోకి వెళ్లిన వందకు పైగా లారీలు చిక్కుకుపోయాయి.
విషయం తెలిసి పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఇతర అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. దాదాపు 130కి పైగా లారీలు వరదలో చిక్కుకుపోయినట్లు సమాచారం. వరదనీరు పెరుగుతుండడంతో ప్రస్తుతానికి డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలను పడవల్లో తరలిస్తున్నారు.
వరద ప్రవాహానికి ఇసుక రీచ్ లోకి వెళ్లే రోడ్డు కొట్టుకుపోయింది. లారీలు ఉంటాయా..? ప్రవాహంలో కొట్టుకుపోతాయా అని ఆందోళనలో ఉన్నారు యజమానులు.