యమునోత్రి జాతీయ రహదారిపై శనివారం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. జాతీయ రహదారి పక్కన రక్షణ గోడ శనివారం ఒక్కసారిగా కూలిపోయింది.
దీంతో అటుగా వెళుతున్న సుమారు పదివేలకు మందికి పైగా భక్తులు రోడ్లపైనే చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు చేరుకుని రోడ్డు పునరుద్దరణ పనులు మొదలు పెట్టారు.
పునరుద్ధరణ పనులు పూర్తి కావడానికి మూడు రోజుల వరకు పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. భక్తులను చిన్న చిన్న వాహనాల్లో అక్కడి నుంచి తరలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ సుదూర ప్రాంతాల నుంచి పెద్ద వాహనాల్లో వచ్చిన ప్రయాణీకులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చార్‌ధామ్ యాత్రా ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు