చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది మే3న యాత్ర ప్రారంభం కాగా ఇప్పటి వరకు 18 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదరినాథ్ ఆలయాలను గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. నిన్న ఒక్క రోజు బద్రినాథ్ ఆలయాన్ని 6,18,312 యాత్రికులు దర్శించుకున్నట్టు అధికారులు వివరించారు.
కేదరి నాథ్ ఆలయాన్ని 5,98,590, గంగోత్రి ఆలయాన్ని 3,33,9090చ యమునోత్రిని 250,398 మంది యాత్రికులు దర్శించుకున్నట్టు బద్రీనాథ్-కేదరినాథ్ ఆలయాల మీడియా ఇంఛార్జ్ హరీశ్ గాడ తెలిపారు.
కరోనా పాండెమిక్ కు ముందు 2019లో 32,38,047 మంది యాత్రికులు చార్ ధామ్ ను దర్శించుకున్నారు. కరోనా సమయంలో రెండేండ్ల పాటు చార్ ధామ్ యాత్రకు బ్రేక్ పడింది. రెండేండ్ల తర్వాత తాజాగా ఈ ఏడాది మే 3న చార్ ధామ్ యాత్ర మళ్లీ ప్రారంభం అయింది.