పాకిస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఆస్పత్రిలో సుమారు 200లకు పైగా మృత దేహాలు పడివుండటం కలకలం రేపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు పర్యటన సందర్భంగా ఈ ఘటన వెలుగు చూడటం గమనార్హం.
ముల్తాన్‌లోని నిఫ్తార్ ఆస్పత్రి విజిట్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు తారిక్ జమాన్ గుజ్జార్ వెళ్లారు. ఆ సందర్భంలో ఆయనకు మార్చురిలో ఉన్న మృత దేహాల గురించి ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే మార్చురికీ వెళ్లి ఆయన తనిఖీలు చేశారు.
అక్కడ గుట్టలాగా పడి ఉన్న మృతదేహాలను ఆయన గమనించాడు. వెంటనే ఆయన చలించిపోయారు. మార్చురీతో పాటు మార్చురీ రూఫ్ పై కూడా మృత దేహాలు ఉన్నట్టు గుర్తించారు. అయితే మెడికల్ టెస్టుల కోసం ఆ మృత దేహాలను విద్యార్థులు వాడినట్టు తెలుస్తోంది.
శరీరంపై బట్టలు లేకుండా మృత దేహాలన్నీ చెల్లాచెదురుగా పడి వున్న తీరు తీవ్ర ఆందోళనను కలిగించింది. దీంతో ఆ మృతదేహాల గురించి ఆయన ఆరా తీశారు. దీంతో మెడికల్ టెస్టుల కోసం ఆ మృత దేహాలను ఉపయోగించినట్టు తెలిపారు.
రూఫ్‌పై ఉన్న మృతదేహాలకు కాకులు, గద్దలు, పక్షులు ఆహారంగా స్వీకరిస్తున్నట్లు తెలిసింది. ఆ మృత దేహాలను వాటిని తర్వాత వాటిని సరిగ్గా డీ కంపోజ్ చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై నిస్తార్ మెడికల్ కాలేజీ యాజమాన్యం స్పందించింది. మృతదేహాలను అలా నిర్లక్ష్యంగా వదిలేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.