పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యే సభ్యులకు కరోనా పరీక్షలు తప్పనిసరి చేయడంతో.. భారీ సంఖ్యలో ఎంపీలకు కోవిడ్ -19 నిర్ధారణ అయింది. ఉభయ సభల సభ్యులు కలిసి మొత్తం 25 మందికిపైగా ఈ మహమ్మారిబారినపడినట్టు తెలిసింది. ఇందులో 17 మంది లోక్‌సభ ఎంపీలు కాగా.. మిగిలిన వారు రాజ్యసభ సభ్యులుగా గుర్తించారు.
మొత్తం 25 మందిలో 12 మంది బీజేపీ సభ్యులు కాగా.. ఇద్దరు వైసీపీ.., శివసేన, ఆర్ఎల్‌పీ, డీఎంకేకు చెందిన ఒక్కో ఎంపీ ఉన్నారు. కరోనా బారినపడిన సభ్యులందరూ ఈ నెల 13, 14 వ తేదీల్లో టెస్టులు చేయించుకున్నవారే.
కరోనా వ్యాప్తి దృష్ట్యా లోక్‌సభ, రాజ్యసభలను వేరు వేరు సమయాల్లో నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. రాజ్యసభ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కాగా. 7 గంటల వరకు జరగనుంది