అదృష్టం దరిద్రం పట్టినట్టు పడితే ఏమవుతుందో తెలుసా..!ఈ వార్త చూస్తే అర్థమైపోతుంది. కేరళ కోజికోడ్ కు చెందిన 60 ఏళ్ల మమ్మిక్కా ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయాడు. రోజువారీ కూలీ పని చేసుకుంటూ మాసిపోయిన చొక్కా,లుంగీతో కనిపించే అతి సామాన్యుడు. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.
మమ్మిక్కాను ఫోటో షూట్ కోసం ఓ ప్రకటన ఏజెన్సీ సంప్రదించింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ షరీక్ వయాలీల్ అతని స్టైలిష్ ఫోటోలను క్యాప్చర్ చేసాడు.ఇన్ స్టాగ్రామ్ లో అతని షూటింగ్ కు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేశారు.హెయిర్ కట్ నుండి బట్టల మార్పుల వరకు అతను ఎలా స్టైలిష్ గా మర్చారో మొత్తం వీడియోలో ఉంటుంది.
వీడియోలో అతను తన ట్రెండీ సూట్ లు, కూల్ షేడ్స్ లో అట్రాక్టింగ్ గా కనిపిస్తాడు. తన కంపెనీకి మోడల్ గా చేయడానికి మమ్మిక్కా కంటే గొప్పగా ఎవరూ ఉండరని ఫోటోగ్రాఫర్ చెప్పాడు. అవి చూసిన అతని సహచరులు ఆశ్చర్యానికి గురయ్యారు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు ఎలా అయ్యాడు అని అనుకుంటున్నారు.
కొందరు వ్యక్తులు అతనితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మమ్మిక్కా ఫోటోలను చూసిన కొందరు.. నటుడు వినాయకన్ లాగ ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.