బహిష్కృత బీజేపీ నేత నూపుర్ శర్మను అరెస్టు చేయాలని ఏఐఎంఐఎం నేత అసదుద్దిన్ ఓవైసీ డిమాండ్ చేశారు. మహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు గల్ఫ్ దేశాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయన్నారు.

నూపుర్ శర్మను సస్పెండ్ చేస్తే సరిపోదు, ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. విదేశాంగ శాఖ కూడా బీజేపీలో భాగంగా మారిపోయిందా? అని ప్రశ్నించారు.
గల్ఫ్ దేశాల్లో భారతీయులపై విద్వేషపూరిత నేరాలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటే మీరేం చేస్తారు? అని ప్రశ్నలు సంధించారు. విద్వేషపూరిత ప్రకటనలు చేయడానికి బీజేపీ తన ప్రతినిధులను పంపుతోందని, వాటిపై అంతర్జాతీయంగా దుమారం రేగిన తర్వాత వాటిపై బీజేపీ చర్యలు తీసుకుంటోందన్నారు.